ముందుగా అందరూ సమావేశమై చెర్చించుకోవాలి, ఆ సమావేశాన్ని మొదటి లీడర్ ఇంటి వద్ద కానీ రెండవ లీడర్ ఇంటి వద్ద కానీ, సభ్యుల ఇంటి వద్ద కానీ ఎక్కడైనా మహిళా భవన్ దగ్గర కానీ, COMMUNITYHALL దగ్గర కానీ, 10 మంది ప్రతి నెల 10వ తారీకు నాడు సాయంత్రం నాలుగు గంటలకు (4:00PM ) సమావేశమై, ఆ పొదుపులు కట్టుకొని, అందరూ ముఖ్యమైన విషయాలు చేర్చించుకొని తీర్మానం చేసుకోవాలి.
ఇలా చేసుకొని 10 మంది కలిసి DOCUMENTS ముందుగా CO సార్ ని కలవాలి, అప్పుడు CO సార్ అన్ని చెక్ చేసి ఒకే అని సంతకాలు చేసి ఆ డాకుమెంట్స్ తీసుకొని, APPLICATION FORM ఇస్తారు.
దాని పైన 10 మంది గ్రూప్ సభ్యుల PHOTOS ని సింగల్ గా పెట్టి దాని పక్కన DETAILS రాయాలి.
అవి ఎం అనగా అంటే
> సభ్యురాలి పేరు / NAME
> భర్త పేరు / HUSBAND NAME
> ఇంటి నెంబర్ / HOUSE NUMBER
> కులము / CASTE
> వయస్సు / AGE
> చదువు / QUALIFICATION
> వృత్తి / OCCUPATION
> ఆధార్ నెంబర్ / ADHAR NUMBER
> ఫోన్ నెంబర్ / PHONE NUMBER
> ఓటరు ID నెంబర్ / VOTER ID NUMBER
> కుటుంబ సభ్యుల వివరాలు / FAMILY MEMBERS DETAILS
> రేషన్ కార్డు నెంబర్ / RATION CARD NUMBER
ఇలా అన్ని రాసి ఇవ్వాలి.
ఈ గ్రుపుకు లీడర్లుగా ఏంచుకున్న వారివి ముంధు, ఒకటి లేదా రెండు నంబర్ లో
రాసి మిగితావి సీరియల్ గా రాయాలి, ఆ ఇద్ధరి లీడర్లకు ఓక గ్రీన్ కార్డ్ ఇస్తారు
ధని పైనా ఫోటోలు పెట్టి అతికించాలి గ్రూప్ స్టాంప్ వేసి దాని పైనా లీడర్లు సంతకాలు చేయాలి
వాటి పైనే కాకుండా మిగితా వాటి మీద కూడా స్టాంప్ వేసి సంతకాలు చేయవలసి ఉంటుంది
ప్రతి పేపర్ మీద కూడా చెక్ చేసుకొని సంతకాలు చేయాలి.
అప్పుడు మల్లి CO సార్ ని కలిసి ఈ DOCUMENTS ఇస్తే, అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని
CO సార్ బ్యాంకు లో సబ్మిట్ చేస్తారు.
అప్పుడు బ్యాంకు వారు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్కోని 10 మందిని బ్యాంక్ కు రమ్మంటారు.ముందుగా చెప్పిన DOCUMENTS ఓరిజీనల్స్ తీస్కోని రమ్మంటారు
ఎందుకంటె ADDRESS లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొడానికీ, మన ఓరిజీనల్స్ DOCUMENTS చెక్ చేసాక మనవి మనకు తిరిగి ఇస్తారు, అన్నీ సరిగ్గా ఉంటె ఇక వెళ్ళొచ్చు అని చెప్తారు.
ఖాతాకు సంబంధించిన నెంబర్ ను మీ CO ద్వారా తెలియ చేస్తాం అని చెప్తారు, ఖాతా నంబర్ వచ్చాక CO సార్ మనకు ఇంటిమేషన్ ఇస్తారు, అప్పుడు ఆ ఖాతా నంబర్ మనం ఎంతైతే పొదుపు చేసుకుంటామో, ఆ పొదుపు మొత్తమ్ బ్యాంకు లో జమ చేసుకోవాల్సి ఉంటుంది.
పొదుపు జమ చేసాక ధానికి సంబంధంచిన, మనకు బ్యాంకు పాస్ బుక్కు కూడా బ్యాంకు వారు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం క్రమం తప్పకుండ ప్రతి నెల 10వ తారికు నాడు బ్యాంకులో డబ్బులు పొదుపు చేస్కోవాల్సి ఉంటుంది.
స్వయం సహాయ సంఘానికి ఎన్ని బుక్స్ ఉంటాయ్ అంటే:
1. బ్యాంకు పాస్ బుక్ ఉంటుంది.
2. తీర్మానం పుస్తకం ఉంటుంది దాని ని REGISTER PASSBOOKS అని కూడా అంటారు.
3. 10 మందికి 10 పాస్ పుస్తకాలు ఉంటాయి, INDIVDUAL PASSBOOKS అంటారు.
ఇలా ప్రతి నేల సమావేశంలో పొదుపులు కట్టుకొని ఆ మొత్తమ్ ను బ్యాంకుకు జమ చేసుకోవాలి
ధానికి సంబంధంచిన వివరాలను తీర్మానంలో రాసుకొని 10 మంది సభ్యులు సంతకాలు పెట్టుకొని
ఎవరి పాస్ బుక్ లో ఎంత పొదుపు కడుతున్నారో లీడర్ రాసి సంతకం పెట్టి ఆ పాస్ బుక్ లు ఎవరిది వారికి ఇవ్వాలి.
బ్యాంకు ఖాతా ఎలా తేరుచుకోవాలి/OPEN చెయ్యాలి అనేది పూర్తి వివరణ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మల్లి NEXT బ్లాగ్ లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ అందరికి నేను పెట్టె బ్లాగ్ లు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ సర్కిల్ లో షేర్ చేయండి.
అలాగే నా YOUTUBE CHANNEL ని SUBSCRIBE చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.

No comments:
Post a Comment