Saturday, October 29, 2022

CHAPTER 1 - SHG గ్రూపు పూర్తి వివరాలు

    ఈ బ్లాగ్ లో మనం SHG గురించి తెలుసుకుందాం .... 

  • గ్రూపు ఎలా చేసుకోవాలి ?
  • గ్రూపు లో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి ?
  • దానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
  • దానికి సంబందించిన బ్యాంకు ఖాతా ఎలా తెరవాలి ?
  • వారు ఒకే ప్రాంతానికి చెందిన వారై ఎందుకు ఉండాలి ?
  • గ్రూపు సంఘానికి బ్యాంకు ఖాతా ఎందుకు తీయాలి ?
  • గ్రూపు సంఘానికి పేరు ఎందుకు పెట్టాలి ?
  • గ్రూపు లో ఎలాంటి మహిళలను, పేదరికం ఐనా మహిళలను చేర్చుకోవాలని ఎందుకు అనుకుంటారు ?
  • వారికి వయసు పరిమితి ఎంత ఉండాలి ?

ఇలా గ్రూపు చేసుకోవడం వల్ల లాభాలు ఏమిటి అని పూర్తి వివరాలతో నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, అందరూ ఈ బ్లాగ్ నీ చివరి వరకు చదవండి. 

అలాగే అందరూ తప్పకుండా నా YOUTUBE ఛానల్ ని SUBSCRIBE చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఆలా చేసుకోవడం వల్ల నేను పెట్టె ప్రతి వీడియో మీకు NOTIFICATIONS రూపంలో వస్తాయి, అలాగే నా  వీడియోస్ గనుక మీకు నచ్చినట్లు ఐతే LIKE, SHARE చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటె COMMENTS లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను మీ డాట్స్ క్లియర్ చేస్తాను. 

పైన చదివినట్లైతే మనము స్వయం సహాయక సంఘం గురించి ప్రశ్నల రూపకం లో తెలుసుకున్నాము, ఇప్పుడు దాని వివరణ తెలియచేస్తాను. 




స్వయం సహాయక సంఘం అంటే "SHG ( SELF HELP GROUP )" అని అర్ధం. 
  • ముందుగా మహిళలు అందరూ సమావేశం అవ్వాలి. 
  • మనం ఇరుగు పొరుగు వారు రోజు మాట్లాడుకుంటాం కదా వారితో అయిన పర్లేదు. 
  • స్వయం సహాయక సంఘానికి కావాల్సిన సభ్యుల సంఖ్య పది మంది ఉండాలి. 
  • వారందరు ఒకే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.  
  • అలాగే మనస్తత్వం కూడా అందరిది ఒకేలాగా ఉండాలి
  • ఆ పది మంది సభ్యులలో ఆరు మంది సొంత ఇంటి వారై ఉండాలి. 
  • మిగతా నాలుగు అద్దె ఇల్లు వారై ఉన్న సరిపోతుంది. 
  • ఇలా పది మంది సభ్యులు సమావేశమై మనం గ్రూపు ఎలా చేసుకోవాలి అని తీర్మానించుకోవాలి. 
  • ముందుగా ఆ సంఘానికి పేరు పెట్టుకోవాలి తరువాత ఆ సంఘం మీద గ్రూపు స్టాంపు చేయించుకోవాలి. 
  • ఆ పది మందిలో ఇద్దర్ని లీడర్లు గా ఎంచుకోవాలి ఎందుకంటే పది మంది రోజు తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఇద్దరు లీడర్లని ఎంచుకుంటే అన్ని పనులు వారే చూసుకుంటారు. 
ఆలా వారిద్దరే చూసుకుంటున్నారని మిగతా సభ్యులు అనుకోకూడదు, ఆ బాధ్యత మిగతా వారు కూడా పంచుకోవాలి. 




గ్రూపు కి కావాల్సిన DOCUMENTS ఏమిటి అవి తెలియ చేస్తాను. 
  1. ఆధార్ కార్డు.  
  2. ఓటర్ కార్డు. 
  3. రేషన్ కార్డు ఆన్ లైన్ నెట్ పేపర్. 
  4. కరెంటు బిల్లు. 
  5. గ్యాస్ బిల్లు. 
ఈ ఐదు DOCUMENTS ప్రూఫ్స్ కావాలి. 

ఇలా అన్ని రెడీ చేసుకున్నాక " MUNICIPAL OFFICE " కి వెళ్ళాలి. అక్కడ DPO మేడం ఉంటారు, DPO మేడం అంటే " DISTRICT PROJECT OFFICER " మేడం, SHG ల మీద CO సార్లు కూడా ఉంటారు, వారిని COMMUNITY OFFICERS అని కూడా ఉంటారు.  

ముందుగా CO సార్ ని కలవాలి, సభ్యుల DOCUMENTS అన్ని చూయించాలి, CO సార్ అన్ని చేక్
చేసుకొని APPLICATION FORM ఇస్తారు. దాంట్లో బ్యాంకు ఖాతా ను ఎలా ఓపెన్ చేసుకోవాలో అని వివరణ ఉంటుంది. 

ఇలా SHG గ్రూపులకు 30 రూపాయలు నుండి 50 రూపాయల వరకు కాకపోతే 100 రూపాయల నుండి 200 రూపాయాల వరకు పొదుపులు కట్టుకుంటారు. 
             అది పది మంది ఎంత కట్టుకుంటారో అని తీర్మానించుకుని దాని ప్రకారమే సమానంగా పొదుపు చేసుకోవాలి, ఇలా క్రమం తప్పకుండా 10వ తేదీ నాడు పొదుపులు బ్యాంకులో కట్టుకోవాలి. 

ఇప్పటి వరకు మనము SHG స్వయం సహాయక సంఘం ని ఎలా ఫార్మ్ చేసుకోవాలో తెలుసుకున్నాము, దాని వివరాలు పూర్తిగా మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. 

                                           

మల్లి NEXT బ్లాగ్ లో బ్యాంకు లో ఖాతా ను ఎలా తెరుచుకోవాలి ? 
దానికి సంబందించిన DOCUMENTS ఏమిటి ?
వివరణ ఏంటో ? 
సభ్యుల సంఖ్యా ఏంటి ?
ఇవన్నీ పూర్తి వివరాలతో తెలియచేస్తాను. 


 

Saturday, October 15, 2022

OM SRI MAHILA SHAKTI - INTRODUCTION

హలో అండీ ముందుగా నా బ్లాగ్ చూస్తున్న వాలందరికి నా నమస్కారాలు తెలియచేస్తున్నాను. 

వెల్కం టూ మై బ్లాగ్ " ఓం శ్రీ మహిళా శక్తి ". 

నా పేరు " పసునూరి విజయలక్ష్మి ", నేను ఇలా బ్లాగ్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉదేశ్యం మహిళలకు ముఖ్య సందేశాల గురించి తెలియచేయడం కోసం. 

ముందుగా "SHG(Self help group)" గ్రూపు ల పైన వివరాలను తెలియచేస్తాను, ఎందుకంటే నేను 1995లో గ్రూపు సంగం 20 మందితో ప్రారంభించాను, SHG నీ తెలుగు లో " స్వయం సహాయక సంగం " అని కూడా పిలుస్తారు. ఆలా 1995 లో నేను ఇద్దరు లీడర్ల తో  ప్రారంభించిన గ్రూపుకి మొదటి లీడర్ గా కొనసాగుతూ వచ్చాను.

ఆలా నా ప్రయాణం మొదలైంది..... 

                                                                                    
                                                                                                 

దీనిపై నాకు 28 ఏళ్ళ అనుభవం ఉంది కావున, ఈ విషయాల గురించి క్లుప్తంగా అందరికి తెలియచేయాలి అన్నదే ఈ నా చిన్ని ప్రయత్నం. 
          దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్న విషయాల గురించి కూడా రాబోయే ముందు ముందు బ్లాగ్ లా ద్వార  తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను.  

ఈరోజు నేను "SHG" లీడర్ నుండి " ( TLF ) TOWN LEVEL FEDERATION " పట్టణ సమైక్య అధ్యక్షురాలిగా ఎదిగాను, అది ఎలా అనేదాన్ని గురించి కూడా పూర్తి వివరాలు తెలియచేస్తాను, ఎందుకనగా "SHG" గ్రూప్ ల గురించి అందరికి అవగాహన లేదు, దాని కట్టుబాటలు తెలియదు, ఇలా నా బ్లాగ్ ద్వారా నన్ని FOLLOW  అయినా వాలందరికీ నాకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వగలుతానన్న ఉదేశ్యం తో ప్రారంభించాను. 

ఇలా మీకు తెలియని విషయాల గురించి, పొదుపు లో వచ్చే LOANS  గురించి, మహిళల ఉపాధుల గురించి ప్రతి ఒక్క విషయాల గురించి క్లుప్తంగా తెలియచేస్తాను. 

నా BLOGG  ఇన్ఫర్మేటివ్ గా మీకు అనిపిస్తే ఫాలో అవ్వండి, అలాగే మీకు తెలిసిన వాళ్లతో కూడా SHARE  చేసుకోండి, ఆలా చేయడం వల్ల నేను పెట్టె ప్రతి ఒక్క కంటెంట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. 

అందరు ఈ BLOGG ద్వారా నన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారనే భావిస్తున్నాను, అలాగే ఈ విషయాల గురించి మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే కూడా మనకి 
 "OM SRI MAHILA SHAKTI " అని ఒక "YOUTUBE"  ఛానల్ కూడా ఉంది నేను కింద మీకు ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను నచ్చిన వాళ్ళు SUBSCRIBE చేసుకోండి. 

SUBSCRIBE TO MY YOUTUBE CHANNEL 👇👇👇👇👇👇





CHAPTER 2 - SHG బ్యాంకు ఖాతా ఎలా తేరుచుకోవాలి/OPEN చెయ్యాలి

ఈ బ్లాగ్ లో " SHG"  బ్యాంకు ఖాతాను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.  దానికి సంబందించిన వివరాలు మీకు తెలియచేస్తాను. ముందుగా అందరూ సమ...